అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. రాకా రిలీజ్ మరింత ఆలస్యం !

అల్లు  అర్జున్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..  రాకా రిలీజ్ మరింత ఆలస్యం !

అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టు ‘రాకా'. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ కు  సంబంధించి ఓ ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. మొదట ఈ సినిమాను 2027 ఫస్ట్ క్వార్టర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న తాజా టాక్ ప్రకారం, ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా సినిమా కథలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కు  అత్యంత ప్రాధాన్యం ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం అదనపు సమయం కేటాయించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారట. 2027 డిసెంబర్ 2న ఈ చిత్రం విడుదల చేసేలా పక్కా ప్లాన్స్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ రిలీజ్ డేట్ పై టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిస్తుడటంతో వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. షూటింగ్ పూర్తయిన తర్వాత వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీపిక పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచాయి.