లవర్​తో కలిసి  భర్తను చంపింది

V6 Velugu Posted on Oct 05, 2021

గద్వాల, వెలుగు:  ప్రియుడితో కలిసి భర్తను చంపిందో మహిళ. రెండు రోజుల క్రితం జరిగిన వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును గద్వాల జిల్లా పోలీసులు ఛేదించారు. సోమవారం ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి కేసు వివరాలు వెల్లడించారు. రాజు, మాధవి దంపతులు గద్వాల మండలం ములకలపల్లి శివారులోని ఓ పంట్ల తోట వద్ద నివాసముంటున్నారు. వీరికి 11 సంవత్సరాల క్రితం పెళ్లైంది. తరచూ గొడవలు జరుగుతుండడంతో మూడు నెలల క్రితం మాధవి తల్లిగారి ఊరైన భగవాన్ పల్లికి వెళ్లింది. రాజు ఆమె దగ్గరికి వెళ్లి మళ్లీ సంసారానికి తీసుకొచ్చాడు. ఆయనతో సంసారం ఇష్టంలేని మాధవి ప్రియుడు బోయ మునేశ్​తో కలిసి భర్త హత్యకు ప్లాన్​ వేసింది. బోయ ఉమేశ్​ భగవాన్ పల్లికి చెందిన తన మిత్రులు కుంటి జైపాల్, రవి, రవీంద్ర సాయం తీసుకున్నాడు. ప్లాన్​ ప్రకారం ఈ నెల 2న రాత్రి రాజు తింటున్న ఆహారంలో భార్య మాధవి నిద్రమాత్రలు కలిపింది. అది తిన్న రాజు గాఢనిద్రలోకి వెళ్లగా.. కాళ్లు చేతులు పట్టుకొని గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు శవాన్ని అక్కడే ఉన్న ట్రాన్స్​పోర్ట్ పక్కన పడేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్యే హత్య చేసినట్లు గుర్తించాడు. నిందితులను సోమవారం అదుపులోకి తీసుకొని వారి నుంచి నాలుగు సెల్​ఫోన్లు, బైక్, మృతుడి సెల్ ఫోన్, గొంతు బిగించడానికి వాడిన తాడు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ కేసును చేధించడంలో చురుకుగా వ్యవహరించిన సీఐ ఎస్ఎం భాష, రూరల్ ఎస్సై గాయత్రి ఇతర సిబ్బందికి రివార్డు అందిస్తామన్నారు. ప్రెస్ మీట్ లో డీఎస్పీ రంగస్వామి  
ఉన్నారు. 

Tagged HUSBAND, Wife, killed, Gadwala District, lover,

Latest Videos

Subscribe Now

More News