సిటీలో లేక్ పార్కుల చుట్టూ ఫుడ్ వెహికల్స్​

సిటీలో లేక్ పార్కుల చుట్టూ ఫుడ్ వెహికల్స్​

హైదరాబాద్, వెలుగు: సిటీలోని చెరువులు కొత్త కళతో ఆకట్టుకుంటున్నాయి. చెరువుల చుట్టుపక్కల బ్యూటిఫికేషన్​తో పాటు వాకింగ్ ట్రాక్‌‌‌‌లు, సేదతీరేందుకు బెంచీలు, పిల్లలు ఆడుకునేందుకు గేమ్ జోన్​ను అందుబాటులోకి తేవడంతో జనాల రద్దీ పెరుగుతోంది. మంచి లైటింగ్‌‌‌‌, ఆహ్లాదకరంగా ఉంటుండటంతో లేక్స్ చుట్టుపక్కల ఏరియాలోని జనాలు కుటుంబసభ్యులతో కలిసి సాయంత్రం పూట అక్కడే ఎక్కువ టైమ్ గడుపుతున్నారు.  సిటిజన్లకు కొత్త హ్యాంగవుట్ ప్లేస్​లుగా ఇవి మారాయి. దీంతో ఫుడ్ ఆన్ వీల్స్ కూడా అక్కడికే వస్తున్నాయి. ప్రస్తుతం సిటీలోని బ్యూటిఫికేషన్ చేసిన లేక్‌‌‌‌ల పక్కన పదుల సంఖ్యలో ఫుడ్ వెహికల్స్ కనిపిస్తున్నాయి. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు లేక్ చూడటానికి వచ్చే వారితో ఫుడ్ వెహికల్స్ వద్ద రద్దీ కనిపిస్తోంది.

రిలాక్స్ అవుతూ..

రాయదుర్గంలోని మల్కం చెరువు, ఖాజాగూడ లేక్, దుర్గం చెరువు లేక్, కూకట్ పల్లి ఐడీఎల్, సరూర్ నగర్‌‌‌‌‌‌‌‌ లేక్ ఇలా పలు చోట్ల సందర్శకుల సంఖ్య ఎక్కువవుతోంది. ఐడీఎల్‌‌‌‌ లేక్ వద్ద దాదాపు 40కి పైగానే ఫుడ్ వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా మిగతా ఏరియాలకు కూడా ఇది విస్తరించింది. గ్రీనరీ, ప్రశాంతత, పిల్లలకు ఆటవిడుపుగా ఉండటం, సైక్లింగ్ ట్రాక్‌‌‌‌లు, లేక్ వ్యూ కనిపించేలా బెంచీలు, వాకింగ్ ట్రాక్‌‌‌‌లో మంచి లైటింగ్ ఇవన్నీ ఉండటంతో జనాలు అక్కడికి ఎక్కువగా వెళ్తున్నారు. ఇలా వస్తున్న వారితో చిరువ్యాపారులు గిరాకీ పెంచుకుంటున్నారు.

టేస్టీ ఫుడ్ ..

సిటీలోని అన్ని ఏరియాల్లో ఫుడ్ ఆన్ వీల్స్ తిరుగుతున్నాయి. జనాలు కనిపిస్తే బండ్లు అక్కడ పెట్టేసి బిజినెస్ చేసేస్తున్నారు. అయితే ఎక్కువగా రద్దీ ఉండే ఏరియాలను చూసుకుని మరి అక్కడికే మారుతున్నారు చాలామంది. అందులో భాగంగానే లేక్‌‌‌‌ల ముందుకు మకాం మారుస్తున్నారు. కొన్నిచోట్ల మధ్యాహ్నం నుంచి మరికొన్ని చోట్ల సాయంత్రం నుంచి 6 గంటల  నుంచి అర్ధ
రాత్రి12 గంటల వరకు అందుబాటులో ఉంటున్నాయి. వాటిల్లో టేస్తీ ఫుడ్, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, టిఫిన్స్ అమ్ముతున్నారు. ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌లు, ఫలుదా, పానీపూరి, కబాబ్స్ తో ఒక ట్రక్, ఆల్ టిఫిన్స్ తో ఒకటి, మీల్స్ తో, స్నాక్స్ తో ఇలా వెరైటీ క్యూజిన్స్​తో ఈ ఫుడ్ ఆన్ వీల్స్ వెహికల్స్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్​ను అందిస్తున్నాయి. అందులో నచ్చిన వెరైటీని లాంగించేస్తూ సిటిజన్లు రిలాక్స్ అవుతున్నారు.

ప్రశాంతంగా..

ఒకప్పుడు మాల్స్​కు ఎక్కువగా వెళ్లేవాళ్లం. ప్రస్తుతం ఇంటి దగ్గరలో మల్కం చెరువు వద్ద లేక్ పార్క్ ఓపెన్ అయ్యాక అక్కడికే వెళ్తున్నాం. ఉదయం వాకింగ్ కోసం బెస్ట్ ఆప్షన్​గా ఉంటోంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు చెరువు చుట్టూ గ్రీనరీ చూస్తూ రిలాక్స్ అవ్వొచ్చు. చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. బయటకు రాగానే డిఫరెంట్ స్నాక్స్ అందుబాటులో ఉంటున్నాయి.  
- అయాన్, రాయదుర్గం

లైటింగ్ బాగుంది

సాయంత్రం టైమ్​లో  ఫ్రెండ్స్​తో కలిసి వెళ్లేందుకు  ఐడీఎల్ లేక్  నయా హ్యాంగవుట్ ప్లేస్​గా మారింది. రోజు ఫుల్ రష్ ఉంటోంది. రాత్రి 12 వరకు అక్కడ ఫుడ్ వెహికల్స్ ఉంటాయి.  లేక్ చుట్టూ  లైటింగ్ కూడా బాగుంటుంది.
- రవి, కూకట్ పల్లి