గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామం.. సీఎం తప్ప మంత్రులు మొత్తం రాజీనామా

గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామం.. సీఎం తప్ప మంత్రులు మొత్తం రాజీనామా

అహ్మదాబాద్: గుజరాత్ రాజకీయాల్లో గురువారం కీలక పరిణామం జరిగింది. గుజరాత్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి మినహా మిగిలిన మంత్రులంతా రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. శుక్రవారం గుజరాత్లో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. 

ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఒక్కరు తప్ప మంత్రులు మొత్తం రాజీనామా చేయడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్తవారిని అధిష్ఠానం ఎంపిక చేయనుంది. కొత్త కేబినెట్‌ శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటయ్యే అవకాశం ఉందని తెలిసింది.

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధిష్టానం సూచన మేరకు ఒక్క ముఖ్యమంత్రి తప్ప మంత్రులంతా రాజీనామా చేయాలని నిర్ణయించారు. మొత్తం 16 మంది మంత్రులు తమ రాజీనామాలను ముఖ్యమంత్రికి సమర్పించారు. మంత్రుల రాజీనామా లేఖలను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ వ్రత్కు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గురువారం రాత్రి సమర్పించనున్నారు.