
ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అక్టోబర్ 19 నుంచి టీమిండియాతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. ఐపీఎల్ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో గాయపడిన ఈ ఆసీస్ కెప్టెన్ యాషెస్ ఆడడం కూడా అనుమానంగా మారింది. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో 2023 వన్దే వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియాకు అందించిన కమ్మిన్స్ ఈ సిరీస్ లో లేకపోవడం ఆసీస్ కు మైనస్ గా మారింది. కమ్మిన్స్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ కు ముందు కమ్మిన్స్ ఒక ఇంటర్వ్యూలో తన ఆల్ టైం ఇండియా, ఆస్ట్రేలియా కంబైన్డ్ జట్టును ప్రకటించాడు.
కమ్మిన్స్ ప్రకటించిన ప్లేయింగ్ 11 లో కేవలం ముగ్గురు మాత్రమే ఇండియన్ ప్లేయర్లు మాత్రమే ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. స్టార్ స్పోర్ట్స్ కోసం జరిగిన ప్రోమో షూట్ సందర్భంగా జరిగిన ఈ ఇంటర్వ్యూలో.. ఓపెనర్లుగా టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ తో పాటు ఇటీవలే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ ను ఎంచుకున్నాడు. మూడో స్థానంలో ఆస్ట్రేలియా ఆల్ టైం బెస్ట్ బ్యాటర్ రికీ పాంటింగ్ ను ఎంపిక చేశాడు. నాలుగు ఐదు స్థానాల్లో ఇద్దరు ఆసీస్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చాడు. నాలుగు, ఐదు స్థానాలకు స్టీవ్ స్మిత్, వాట్సన్ లను ఎంచుకున్నాడు. ఫినిషర్ గా మైఖేల్ బెవాన్ ను వికెట్ కీపర్ బ్యాటర్ గా ఎంఎస్ ధోనిని తన జట్టులో చేర్చుకున్నాడు.
బౌలింగ్ లోనూ ఎక్కువగా ఆసీస్ బౌలర్లను ఎంపిక చేశాడు. స్పీడ్ స్టార్ బ్రెట్ లీతో పాటు ఆల్ టైం బెస్ట్ ఆస్ట్రేలియా పేసర్ గ్లెన్ మెగ్రాత్ కు ఛాన్స్ ఇచ్చాడు. టీమిండియాలో జహీర్ ఖాన్ కు ఎంపిక చేశాడు. ఏకైక స్పిన్నర్ గా షేన్ వార్న్ ను తన ప్లేయింగ్ 11లో చేర్చుకున్నాడు. వన్డేల్లో అద్భుతమైన గణాంకాలను కలిగిన విరాట్ కోహ్లీని కమ్మిన్స్ ఎంచుకోకపోవడం షాకింగ్ కు గురి చేసింది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు రోహిత్ శర్మను కూడా పక్కనపెట్టాడు. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, స్టార్క్, గిల్ క్రిస్ట్, హేడెన్ లకు సైతం కమ్మిన్స్ జట్టులో ఛాన్స్ ఇవ్వలేదు.
కమ్మిన్స్ ఆల్ టైమ్ ఇండియా, ఆస్ట్రేలియా కంబైన్డ్ జట్టు:
డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, స్టీవెన్ స్మిత్, షేన్ వాట్సన్, మైఖేల్ బెవాన్, ఎంఎస్ ధోని, షేన్ వార్న్, బ్రెట్ లీ, జహీర్ ఖాన్, గ్లెన్ మెక్‌గ్రాత్
Pat Cummins ಅವರ AUS-IND All-Time Greatest 'Playing XI' ಹೇಗಿದೆ? 🤔
— Star Sports Kannada (@StarSportsKan) October 16, 2025
📺 ವೀಕ್ಷಿಸಿ | Next 👉 #AUSvIND | 1st ODI | 19th OCT, 8:00 AM | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TeamIndia pic.twitter.com/NtstX2gLnc