Bhadrakaali OTT: ఓటీటీలోకి పొలిటికల్‌, క్రైమ్ థ్రిల్లర్.. ‘భద్రకాళి’ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

Bhadrakaali OTT: ఓటీటీలోకి పొలిటికల్‌, క్రైమ్ థ్రిల్లర్..  ‘భద్రకాళి’ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

విలక్షణమైన తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన రీసెంట్ మూవీ ‘భద్రకాళి’. తమిళంలో 'శక్తి తిరుమగన్' గా విడుదలైంది. ఇది విజయ్ ఆంటోనీ 25వ మూవీ. సెప్టెంబర్ 19న విడుదలైన ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్‌గా థియేటర్లోకి వచ్చింది. ‘అరువి’ లాంటి క్లాసిక్ సినిమా తీసిన దర్శకుడు అరుణ్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి రానుంది. లేటెస్ట్గా ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ను అనౌన్స్ చేశారు మేకర్స్. వచ్చే శుక్రవారం (అక్టోబర్ 24) నుంచి జియోహాట్‌స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సదరు ఓటీటీ నిర్వాహకులు వెల్లడించారు. తమిళంతో పాటుగా తెలుగులో కూడా అందుబాటులోకి రానున్నట్లు ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. 

“ప్రతి మైండ్కు ఓ మాస్టర్ ఉంటారు. మాస్టర్‌మైండ్ శక్తి తిరుమగన్ను అక్టోబర్ 24 నుంచి జియోహాట్‌స్టార్లో కలవండి.. శక్తి తిరుమగన్ అక్టోబర్ 24 నుంచి కేవలం జియోహాట్‌స్టార్లో” అనే క్యాప్షన్తో ట్వీట్ చేసింది. 

అయితే, సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయిన, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో సాగింది. ట్విస్టులు, టర్నింగ్ పాయింట్స్తో థ్రిల్లర్ ఆడియన్స్కు కనెక్ట్ అయింది. కుంభకోణం, మర్డర్, కమర్షియల్ వంటి ఎలిమెంట్స్ సినిమాకు కలిసొచ్చాయి. థ్రిల్లింగ్ కథలను ఇష్టపడేవారికి, రాజకీయ అంశాలపై అవగాహన ఉన్నవారికి ఈ సినిమా మంచి ఎంపిక.

కథనం సంక్లిష్టంగా ఉండటం, ద్వితీయార్థం కొంత నెమ్మదిగా సాగడం వంటి లోపాలు ఉన్నప్పటికీ, విజయ్ ఆంటోనీ నటన, నేపథ్య సంగీతం, ఫస్ట్ హాఫ్ ఆసక్తిగా ఉండటం సినిమాకు బలాలుగా చెప్పొచ్చు. విజయ్ ఆంటోనీ కిట్టు పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. తన నటనతో పాత్రకు బలాన్నిచ్చారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంగీతం కూడా ఆయనే అందించడం విశేషం. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాలోని ఉత్కంఠను పెంచింది. మొత్తం మీద, ఈ సినిమా ఒకసారి చూసేయొచ్చు. 

ఇకపోతే, ఈ మూవీలో తృప్తి రవీంద్ర, సునీల్ క్రిప్లాని, వాగై చంద్రశేఖర్, మాస్టర్ కేశవ్, సెల్ మురుగన్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో ప్రముఖ నటుడు సునీల్ క్రిప్లాని తిరిగి వెండితెరపైకి రావడం విశేషం. ఆయన భారతీరాజా క్లాసిక్ చిత్రం "కాదల్ ఓవియం' (1982) లో కథానాయకుడిగా కన్నన్ అనే పేరుతో నటించారు.