
గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాంనగర్లో ఉన్న శ్రీరాంచందర్విద్యానికేతన్లో 2001–2002లో ఎస్సెస్సీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తమకు చదువుచెప్పిన కరస్పాండెంట్దంపతులు మాదిరాజు శరత్‌బాబు, కరుణ దంపతులను ఘనంగా సన్మానించారు.
చిన్ననాటి స్నేహితులతో చదువుకున్నప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. బాబు అనే ఉపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో గాయపడగా, అతడికి ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో టీచర్లు శ్యాంప్రసాద్, తిరుపతి రెడ్డి, మధుబాబు, పాత్రికేయులు పారుపెల్లి రాజలింగం పాల్గొన్నారు.