అల్జీమర్స్.. ఎక్కువగా వృద్ధుల్లోనే ఎందుకు.. లక్షణాలేంటంటే

అల్జీమర్స్.. ఎక్కువగా వృద్ధుల్లోనే ఎందుకు.. లక్షణాలేంటంటే

అల్జీమర్స్ వ్యాధి జ్ఞాపకశక్తి, ఆలోచన , ప్రవర్తనను ప్రభావితం చేసే ప్రగతిశీల, కోలుకోలేని మెదడు రుగ్మత. ఇది సాధారణంగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది. అల్జీమర్స్ వ్యాధి వివిధ దశల్లో పురోగమిస్తుంది. దాని అభివృద్ధికి సంబంధించి అనేక ప్రమాద కారకాలు ఉన్నాయి. ఈ వ్యాధిని ముఖ్యంగా మూడు దశలుగా విభజించవచ్చు:

డాక్టర్ అమిత్ హల్దార్, ఫోర్టిస్ హాస్పిటల్ ఆనందపూర్ కోల్‌కతా చెప్పిన దాని ప్రకారం.. “ప్రారంభ దశలో, ఒక వ్యక్తి స్వల్పంగా జ్ఞాపకశక్తిని కోల్పోవచ్చు, పదాలను కనుగొనడంలో ఇబ్బంది పడవచ్చు లేదా ప్రణాళిక నిర్వహణలో ఇబ్బంది పడవచ్చు. మానసిక కల్లోలం అనుభవించవచ్చు, లేదా వారు ఆనందించే కార్యకలాపాలపై ఆసక్తిని కోల్పోవచ్చు. ఈ దశను "మిడ్ కాగ్నిటివ్ ఇంపెయిర్‌మెంట్" అని పిలుస్తారు.

మధ్య దశలో, ఒక వ్యక్తి తన జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యాలు క్షీణించడం కొనసాగుతుంది. వారు రోజువారీ కార్యకలాపాలు, దుస్తులు ధరించడం, స్నానం చేయడం, తినడం వంటి వాటికి సహాయం చేయాల్సి ఉంటుంది. వారు వ్యక్తిత్వ జీవితంలోనూ మార్పులు కలగవచ్చు. ఉద్రేకానికి గురి కావచ్చు లేదా చంచలంగా ఉండవచ్చు లేదంటే నిద్రించడానికి ఇబ్బంది పడవచ్చు.

చివరి దశలో, ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి, సంభాషించడానికి ఒక వ్యక్తి సామర్థ్యం క్షీణిస్తుంది. ఈ దశలో వారు మింగడానికి ఇబ్బంది పడవచ్చు, మంచం పట్టవచ్చు, అంటువ్యాధుల బారిన పడవచ్చు” అని డాక్టర్ హల్దార్ చెప్పారు.

అల్జీమర్స్ వ్యాధి అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రమాద కారకాలు ఉన్నాయి, వాటిలో:

వయస్సు: అల్జీమర్స్ వ్యాధి వయస్సుపై ఆధారపడి ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధి ఎక్కువగా 65ఏళ్ల పైబడిన వారిలో కనిపిస్తుంది.

జన్యుశాస్త్రం: కొన్ని జన్యువులు అల్జీమర్స్ వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి. ఉదాహరణకు, APOE జన్యువును కలిగి ఉండటం వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది.

జీవనశైలి కారకాలు: పేలవమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, అధిక మద్యపానం అల్జీమర్స్ వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి.

వైద్య పరిస్థితులు: అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ అల్జీమర్స్ వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి.

కుటుంబ చరిత్ర: అల్జీమర్స్ వ్యాధి కుటుంబంలో ఎవరికైనా ఉంటే కూడా వంశపారం వచ్చే అవకాశం ఉంటుంది.

డాక్టర్. హల్దార్ ప్రకారం, “మెదడులో వయస్సు-సంబంధిత మార్పులు, జన్యు సంబంధ, పర్యావరణ విషపదార్థాలు చేరడం, దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు, జీవనశైలి కారకాలు, రోగనిరోధక పనితీరు తగ్గడం వల్ల వృద్ధులకు అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉంది. అల్జీమర్స్ వ్యాధికి చికిత్స లేనప్పటికీ, అనేక మోనోక్లోనల్ యాంటీబాడీలు అల్జీమర్స్ వ్యాధిని సవరించే చికిత్సగా ట్రయల్‌లో ఉన్నాయి.

చికిత్స

ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, మందులు, కాగ్నిటివ్ రిహాబిలిటేషన్, క్లినికల్ ట్రయల్స్ లేదా సపోర్ట్ గ్రూపుల్లో చేరడం వంటి కొన్ని చికిత్సలు లక్షణాలను వ్యాధి నిర్థారణకు, మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాబట్టి వృద్ధులు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడం, దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులను నిర్వహించడం మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం.