ప్రీ వెడ్డింగ్‌ షూట్ లో పెళ్లి కూతురు : నేను చనిపోతానా..? అంటూ ప‌రుగులు

ప్రీ వెడ్డింగ్‌ షూట్ లో పెళ్లి కూతురు : నేను చనిపోతానా..? అంటూ ప‌రుగులు

లెబనాన్ రాజధాని బేరూత్‌లో భారీ పేలుడు సంభవించింది. 135 మంది ఈ పేలుడులో చనిపోయారని, 4 వేల మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య మంత్రి చెప్పారు.

పేలుడు జ‌రిగిన ప్రాంతానికి అడుగుల దూరంలో 29 ఏళ్ల లెబనీస్ వధువు ఇస్రా సెబ్లానీ త‌న పెళ్లి కోసం ఫ్రీ వెడ్డింగ్ షూట్ లో పాల్గొంది. న‌వ్వుతూ వెడ్డిండ్ షూట్ లో ఫోజులిస్తున్న ఇస్రా ఒక్క‌సారిగా ప్రాణ భ‌యంతో నేను చనిపోతానా..? నేను ఎలా చనిపోతాను..? అంటూ ప‌రుగులు తీసింది. అదే స‌మ‌యంలో ఆ ప‌రిస‌ర ప్రాంతం అంతా ర‌క్త‌సిక్త‌మైంది. వంద‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. వే‌లాది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

న‌వ్వుతూ వెడ్డింగ్ షూట్ లో పాల్గొన్న ఇస్రాకి చెవులు చిల్లులు ప‌డేలా పేలుడు సంబంవించింది. ఆ పేలుడు తో అక్క‌డేం జ‌రిగిందో తెలియ‌లేదు. రెండు రోజుల త‌రువాత ఆమె ఘ‌ట‌న నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు తెలిపింది.

కాగా బేరూత్‌లో జ‌రిగిన పేలుళ్ల ప్రాంతంలో అక్కడి ఓ గోదాంలో ఆరేళ్లుగా భద్రత చర్యలు లేకుండా 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను నిల్వ చేయడంపై లెబనాన్ అధ్యక్షుడు మికెల్ ఒవాన్ ట్వీట్ చేశారు. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.