
న్యూఢిల్లీ: అమంటా హెల్త్‌కేర్ లిమిటెడ్ షేర్లు మంగళవారం (సెప్టెంబర్ 09) ఇష్యూ ధర రూ. 126తో పోలిస్తే 12.5 శాతం ప్రీమియంతో ముగిశాయి. బీఎస్ఈలో ఈ షేరు ఇష్యూ ధర నుంచి 6.34 శాతం పెరిగి రూ. 134 వద్ద మార్కెట్లో అడుగుపెట్టింది.
ఆ తర్వాత ఇది 11.62 శాతం పెరిగి రూ. 140.65 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈలో ఈ కంపెనీ షేరు 7.14 శాతం ప్రీమియంతో రూ. 135 వద్ద లిస్ట్ అయింది. తదనంతరం 12.5 శాతం పెరిగి రూ. 141.75 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ. 546.13 కోట్లుగా ఉంది.