పెరిగిన అమర్ గ్రాఫ్.. టైటిల్ రేస్లో టాప్.. సడన్గా ఎందుకింత మార్పు?

పెరిగిన అమర్ గ్రాఫ్.. టైటిల్ రేస్లో టాప్.. సడన్గా ఎందుకింత మార్పు?

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో లక్ కలిసిరాని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది అమర్ దీప్(Amar deep) అనే చెప్పాలి. ముందు కొన్ని వారాలు తన ఆటతో ఆడియన్స్ కు చిరాకు తెప్పించినా.. గత ఐదు వారాలుగా అద్భుతమైన ఆటతీరును కనబరుస్తున్నాడు. నిజానికి చాలా అంచనాల మధ్య ఈ సీజన్ లో అడుగుపెట్టాడు అమర్. అదే రేంజ్ లో ఆట కూడా ఇరగదీస్తాడు అనుకున్నారు  అంతా. కానీ ఆడియన్స్ కు, అతని ఫ్యాన్స్ కు దిమ్మతిరిగిపోయే షాకిచ్చాడు. 

టాస్కులను సరిగా అర్థం చేసుకోకుండా.. గేమ్స్ అన్నీ తప్పుగా ఆడుతూ.. ఇది అమాయకత్వమా లేక వెర్రితనమా అనే రేంజ్ ఆడాడు అమర్. దీంతో టైటిల్ రేస్ నుండి తప్పుకున్నట్లే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ఐదవ వారం నుండి అదిరిపోయే ఆటతీరుతో ఆడియన్స్ కు తెగ నచ్చేస్తున్నాడు. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ కూడా తనముందు ఒకలా మాట్లాడుతూ..వెనకాల మరోలా మాట్లాడంతో ఆడియన్స్ లో అమర్ పై సింపతీ క్రియేట్ అయ్యింది. 

ఇక ఇటీవల జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అందరూ అతని టార్గెట్ చేయడం కూడా అమర్ కు కలిసొచ్చింది. ఆ సమయంలో అమర్ భాదపటం చూసి ఆడియన్స్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. నిజంగానే అమర్ ను అందరూ టార్గెట్ చేశారని ఫిక్స్ అయ్యారు. దీంతో లాస్ట్ వీక్ ఓటింగ్ లో అమర్ కు రికార్డ్ లెవల్లో ఓటింగ్ నమోదైంది. బయట యూట్యూబ్ ఛానెల్స్ లో నిర్వహించిన దాదాపు అన్ని కమ్యూనిటీ పొలింగ్స్ లో అమర్ టాప్ లో నిలిచాడు. దీంతో మల్లి టైటిల్ రేస్ లోకి దూసుకొచ్చాడు అమర్. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అమర్ విన్నర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో శ్రీకాంత్ అమర్ గురించి మాట్లాడటం కూడా అమర్ కు చాలా ప్లస్ అయ్యింది. మరి ఇదే ఊపు కంటిన్యూ అయితే మాత్రం ఈ సీజన్ లో అమర్ విన్నర్ అవడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు.