ఈ కుర్రోడు అసాధ్యుడు.. పద్నాలుగేళ్లకే సొంత కంపెనీ పెట్టాడు

ఈ కుర్రోడు అసాధ్యుడు.. పద్నాలుగేళ్లకే సొంత కంపెనీ పెట్టాడు
  • కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు

అమర్​ ప్రజాపతి...యూపీ ​లోని గోరఖ్​పూర్​లో ​ 14 ఏండ్ల అబ్బాయి. వయసు చిన్నదే అతని ఆలోచనలు గొప్పవి. ఆ ఆలోచనల్లో  ఎలాంటి స్వార్థం కనిపించదు. పక్కనోడు బాగుండాలనే ఆశ మాత్రమే ఉంటుంది.  అందుకోసం ఏదైనా చేయాలన్న తాపత్రయం కనిపిస్తుంది. ఆ తాపత్రయమే ఎల్​ఈడీ బల్బ్​​ మాన్యుఫాక్చరింగ్​ కంపెనీని స్టార్ట్​ చేయించింది. కొన్ని వందలమందికి ఉపాధి కల్పిస్తోంది. కరోనా వైరస్ కొన్ని​  లక్షల మంది ఉద్యోగాల్ని మింగేసింది. కష్టకాలంలో తినడానికి తిండిలేక ఎంతోమంది అల్లాడారు. అమర్​ ఊళ్లోనూ ఇదే పరిస్థితి. తిండి, బట్టల కోసం జనం ఇబ్బంది పడుతుంటే అమర్‌‌ ఏదైనా చేయాలనుకున్నాడు. ఎల్​ఈడీ మాన్యుఫాక్చరింగ్​ కంపెనీ పెట్టాలనుకున్నాడు.  గోరఖ్​పూర్  ఇండస్ట్రియల్​ డెవలప్​మెంట్​ అథారిటీలో  ఎల్​ఈడీ బల్బ్​​ల మేకింగ్​  కోర్సుల చేరాడు. మొదట ఇంట్లో  బల్బ్​​ల తయారీ మొదలుపెట్టాడు.  ఆ తర్వాత ‘జీవన్​ ప్రకాష్’ ఎల్​ఈడీ బల్బ్​​ మాన్యుఫాక్చరింగ్​ కంపెనీ పెట్టాడు. ఊళ్లోని జనాలకి బల్బ్​​ తయారీలో ట్రైనింగ్ ఇచ్చి కంపెనీలో పని కల్పిస్తున్నాడు.