అమరరాజా తొలి క్వార్టర్ లాభం రూ 132.01 కోట్లు

అమరరాజా తొలి క్వార్టర్ లాభం రూ 132.01 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: అమరరాజా బ్యాటరీస్​కు​ ఈ ఏడాది జూన్ తో ముగిసిన మొదటి క్వార్టర్​లో  రూ. 132.01 కోట్ల లాభం రాగా, జూన్ 2021లో ఇది రూ. 124.10 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయాన్ని రూ. 2,620.53 కోట్లుగా లెక్కించారు. పోయిన ఏడాది క్యూ1లో ఇది రూ. 1,886.17 కోట్లుగా ఉంది.

పన్ను తరువాత లాభం రూ. 134.11 కోట్ల ఉందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. పన్నుకు ముందు లాభం 177.52 కోట్లు. వీటిలో  అమర రాజా బ్యాటరీస్ మిడిల్ ఈస్ట్ (ఎఫ్​జెడ్​ఈ) యూఈఏ , అమర రాజా సర్క్యులర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫలితాలు కలిసే ఉన్నాయి. కంపెనీ లెడ్ యాసిడ్,  ఇతర స్టోరేజీ బ్యాటరీలను తయారు చేస్తుంది.