అమర్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌ యాత్రపై భారీ వానల ఎఫెక్ట్

అమర్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌ యాత్రపై భారీ వానల ఎఫెక్ట్

జమ్మూ: అమర్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌ యాత్రను శుక్రవారం నిలిపివేశారు. జమ్మూ, శ్రీనగర్‌‌‌‌‌‌‌‌ నేషనల్‌‌‌‌ హైవేపై వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇక్కడి నుంచి కొత్త బ్యాచ్‌‌‌‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. శుక్రవారం రాంబన్‌‌‌‌ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయని, దీంతో గురువారం రాత్రి నుంచి హైవేపై వన్‌‌‌‌ వేను మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల జమ్మూ నుంచి అమర్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌ యాత్రను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. హైవేపై పూర్తిగా వెహికల్స్‌‌‌‌ రాకపోకలు ప్రారంభం అయితే యాత్రకు అనుమతించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.