అమెజాన్ మరోసారి ఉద్యోగాల కోత: ప్రైమ్ బిగ్ డీల్ డేస్ వేళ లేఆఫ్స్ ప్రకటన

అమెజాన్ మరోసారి ఉద్యోగాల కోత: ప్రైమ్ బిగ్ డీల్ డేస్ వేళ లేఆఫ్స్ ప్రకటన

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగాల కోతకు తెరలేపింది. కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'ప్రైమ్ బిగ్ డీల్ డేస్' సేల్ ప్రారంభమైన రోజే ఈ లేఆఫ్స్ ప్రకటన . ప్రధానంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను పర్యవేక్షించే 'స్టోర్స్' యూనిట్‌లో ఈ ఉద్యోగాల కోత విధించినట్లు అమెజాన్ బుధవారం అధికారికంగా ధృవీకరించింది. అయితే ఈ తొలగింపులు చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటాయని పేర్కొంది.

ఈ లేఆఫ్స్‌లో 1000 మంది కంటే తక్కువ ఉద్యోగులు ప్రభావితమైనట్లు సమాచారం. కస్టమర్ సర్వీస్, సెల్లింగ్ పార్టనర్ సర్వీసెస్‌తో పాటు అమెజాన్‌లోని ఇతర విభాగాలకు చెందిన పలు డివిజన్లు ఈ కోతకు గురయ్యాయని అంతర్గత స్లాక్ ఛానెల్‌ల ద్వారా తెలిసింది. అమెరికా, భారత్, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన ఉద్యోగులు ఈ పింక్ స్లిప్స్ అందుకున్న వారిలో ఉన్నారు. గత ఏడాది ప్రారంభమై ఈ ఏడాది జనవరి వరకు కొనసాగిన లేఆఫ్స్ లో దాదాపు 30వేల తొలగింపుల తర్వాత కంపెనీ చేపట్టిన చిన్న స్థాయి తగ్గింపుల్లో ఇవి తాజావి.

తమ ప్రాధాన్యతలను మెరుగ్గా నెరవేర్చడానికి వీలుగా స్టోర్స్ వ్యాపారంలో కొన్ని మార్పులు చేశామని అమెజాన్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ మహమ్మారి కాలంలో కంపెనీ ఊహించని విధంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ పేర్కొన్నారు. ఆ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితమై ఆన్‌లైన్ ఆర్డర్లు విపరీతంగా పెంచడంతో తాము హెడ్‌కౌంట్‌ను దానికి అనుగుణంగా పెంచాల్సి వచ్చిందని, ఇప్పుడు ఆ పరిస్థితిని బ్యాలెన్స్ చేయడానికి లేఆఫ్స్ తప్పడం లేదని వివరించారు.

కంపెనీ తన అతిపెద్ద షైనింగ్ ఈవెంట్లలో ఒకటైన ప్రైమ్ బిగ్ డీల్ డేస్ సేల్‌ను మంగళవారం ప్రారంభించి బుధవారం వరకు విజయవంతంగా నిర్వహించింది. వినియోగదారులకు భారీ డిస్కౌంట్లు ఇస్తున్న తరుణంలోనే అంతర్గతంగా ఈ లేఆఫ్స్ వార్తలు బయటకు రావడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాబోయే రోజుల్లో అమెజాన్ తన వ్యూహాలను మరింత మార్చుకునే అవకాశాలు ఉన్నాయని దీని ద్వారా తెలుస్తోంది.