
హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ అమెజాన్ తన జెన్‌జెడ్ ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టోర్ పేరును సర్వ్గా మార్చింది. చిన్న నగరాల నుంచి కొనుగోలుదారులు పెరగడంతో, తక్కువ ధరల్లో లేటెస్ట్ ట్రెండ్స్ దుస్తులను అందించాలని నిర్ణయించామని కంపెనీ తెలిపింది. సర్వ్‌లో 350లకుపైగా బ్రాండ్లు, 20 లక్షలపై ఉత్పత్తులు ఉన్నాయి. ఇవి యువతకు ఎంతో నచ్చుతాయని అమెజాన్ ఫ్యాషన్ ఇండియా డైరెక్టర్ నిఖిల్ సిన్హా అన్నారు. చిన్న నగరాలతోపాటు చండీగఢ్, కొచ్చి, పట్నా, నాగపూర్, జైపూర్, సూరత్ వంటి నగరాల నుంచి భారీగా ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు.