అర్థమైందా అమెజాన్ రాజా.. : తీసేసిన ఉద్యోగికి నాలుగు సార్లు ఆఫర్ .. అయినా..

అర్థమైందా అమెజాన్ రాజా.. : తీసేసిన ఉద్యోగికి నాలుగు సార్లు ఆఫర్ .. అయినా..

టెక్.. టెక్నాలజీ.. ఇది మనిషితో నడిచేది కాదు.. మనిషి బుర్రతో.. అతని బ్రెయిన్ తో నడిచేది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనిషి కాదు.. మనిషి బ్రెయిన్ కు విలువ పెరిగింది..అయితే ఇక్కడ ఓ చిక్కొచ్చి పడింది.. టెక్నాలజీ రంగంలో  బ్రెయిన్ తో పని చేసే ఉద్యోగిని గుర్తించే విషయంలో బడా టెక్ కంపెనీలు సైతం కొన్ని సార్లు బోర్లా పడుతున్నాయి. ఇలాంటిదే ఇప్పుడు అమెజాన్ లో జరిగింది. ఓ ఉద్యోగిని లేఆఫ్ కింద తొలగించింది. అతను వెళ్లిపోయిన తర్వాత అసలు విషయం తెలిసింది.. అతను పని చేసిన విధానం తెలిసోచ్చింది ఈ కంపెనీకి.. దీంతో అతన్ని మళ్లీ తీసుకోవటానికి నాలుగు సార్లు ఆఫర్ ఇచ్చింది అమెజాన్.. అయినా అతను నో అన్నాడు.. నో నో చెప్పాడు.. ఇప్పుడు ఈ విషయంలో ఐటీ రంగంలో హాట్ టాపిక్ అయ్యింది.. పూర్తి వివరాల్లోకి వెళితే...

అతను అమెజాన్ బిజినెస్ ఎనలిస్ట్..ఈ ఏడాది జనవరిలో లే ఆఫ్ కింద అతనిని ఉద్యోగం నుంచి తొలగించింది అమెజాన్ సంస్థ. అతని స్కిల్స్ కంపెనీకి ఎంతో అవసరం అని తిరిగి జాబ్ లో జాయిన్ చేసుకోవాలని  సంస్థ ప్రయత్నించినా.. నాలుగు సార్లు ఆఫర్లు  ఇచ్చినా..ఆ బిజినెస్ ఎనలిస్ట్ మాత్రం  ఒప్పుకోలేదట..ఈ విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. 

Also Read :- ఎంపాకెట్‌‌‌‌లో 4 వేల మందికి జాబ్స్​!

ఉద్యోగులను తొలగింపులకు రెండు నెలల ముందు అమెజాన్ తమ పని, ప్రాజెక్టులను త్వరగా ముగించాలని కోరింది. ఇందులో తొలగించబడిన బిజినెస్ అనలిస్ట్ పేరు కూడా ఉంది. ఉద్యోగ నిర్వహణ సరిగా చేయలేదని పేర్కొంది. తొలగించిన ఉద్యోగులకు ఐటీ కంపెనీలు అవకాశాలు అందించనప్పటికీ అమెజాన్ కు రావడానికి మాజీ ఉద్యోగి ఇష్టపడేలేదు. అమెజాన్ నాలుగు సార్లు అతడిని ఉద్యోగంలోకి తిరిగి తీసుకోవాలని ప్రయత్నించినా.. అతను సంస్థపై నమ్మకాన్ని కోల్పోయాడు. 

అమెజాన్ మాజీ ఉద్యోగి కథ.. గిగ్ ఎకానమీ ఎంప్లాయీస్ ఎదుర్కొనే సవాళ్లను స్పష్టంగా చెప్పింది. భద్రత లేని ఉద్యోగాలు, కార్పొరేట్ చర్యలు ఉద్యోగులను తక్కువ విలువతో, మోసం చేసిన తీరును చెపుతుంది.