
న్యూఢిల్లీ: అమెజాన్ ఇండియా మెడికల్ డయాగ్నోస్టిక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ డయాగ్నోస్టిక్స్ పేరుతో సర్వీస్‌లు లాంచ్ చేసింది. కస్టమర్లు ఇంటి వద్దనే ల్యాబ్ టెస్ట్‌లు బుక్ చేసుకోవచ్చని, అపాయింట్‌మెంట్‌లు షెడ్యూల్ చేయొచ్చని, ట్రాక్ చేయొచ్చని, అమెజాన్ యాప్ ద్వారా డిజిటల్ రిపోర్ట్‌లను పొందొచ్చని కంపెనీ పేర్కొంది. ఆరెంజ్ హెల్త్ ల్యాబ్స్‌తో కలిసి బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ముంబై, హైదరాబాద్‌లో, 450 కి పైగా పిన్ కోడ్‌లలో డయాగ్నోస్టిక్స్ సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీస్‌లో అమెజాన్ మెడికల్ కింద ఉన్న ఫార్మసీ, క్లినిక్ సర్వీస్‌లు కలుస్తాయి.
“ఈ విస్తరణ అమెజాన్ మెడికల్ ఫౌండేషన్‌ను బలోపేతం చేస్తుంది. అమెజాన్ ఫార్మసీతో కస్టమర్లకు ప్రిస్క్రిప్షన్ మందులు, హెల్త్‌కేర్ ఎసెన్షియల్స్, ఫ్రీ టెలిమెడిసిన్ కన్సల్టేషన్, ప్రైమ్, నాన్-ప్రైమ్ మెంబర్స్‌కు డెలివరీ బెనిఫిట్స్ లభిస్తాయి. అమెజాన్ క్లినిక్ ద్వారా లైసెన్స్డ్ డాక్టర్లతో ప్రైమరీ హెల్త్‌కేర్ అవసరాల కోసం డిజిటల్‌గా కన్సల్ట్ అవ్వొచ్చు” అని అమెజాన్ చెప్పింది. అమెజాన్ డయాగ్నోస్టిక్స్ 800కి పైగా టెస్ట్‌లు, 60 నిమిషాల్లో ఇంటిదగ్గర కొచ్చి శాంపిల్ సేకరించడం వంటి సర్వీస్‌లు అందిస్తోంది.