ఈ పేమెంట్స్ తెచ్చిన లాభాలు : ‘అమెజాన్ పే’కు 450 కోట్లు

ఈ పేమెంట్స్ తెచ్చిన లాభాలు : ‘అమెజాన్ పే’కు 450 కోట్లు

పేరెంట్ కంపెనీ అమెజాన్ నుంచి రాక

    పేమెంట్స్ స్పేస్‌‌లో
గట్టి పోటీ ఇచ్చేందుకే…

బెంగళూరు : డిజిటల్ పేమెంట్స్‌‌ సంస్థ ‘అమెజాన్ పే’కు తన పేరెంట్ కంపెనీ, ఈకామర్స్ సంస్థ అమెజాన్‌‌ నుంచి కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. తాజా ఫండ్ ఇన్‌‌ఫ్యూజన్‌‌ కింద ‘అమెజాన్‌‌ పే’కి  రూ.450 కోట్ల నిధులను పేరెంట్ కంపెనీ అందించినట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ ఫైలింగ్‌‌లో తెలిసింది. ఈ ఫండ్స్‌‌ను అమెజాన్‌‌కు చెందిన మారిషస్ సంస్థ నుంచి అందించిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో వెల్లడైంది. ఈ నిధులను డిజిటల్ పేమెంట్స్ స్పేస్‌‌లో, తన వ్యాపారాలు మరింత షేరును దక్కించుకోవడం కోసం ఉపయోగించనుంది. వాల్‌‌మార్ట్‌‌ గ్రూప్‌‌కు చెందిన ఫోన్‌‌పే, అలీబాబా, సాఫ్ట్‌‌బ్యాంక్‌‌లు పెట్టుబడులు పెట్టిన పేటీఎం కంపెనీ ఈ పేమెంట్స్ స్పేస్‌‌లో ఇప్పటికే చక్రం తిప్పుతున్నాయి.

మొత్తం రూ.3 వేల కోట్లు

తాజాగా వచ్చిన ఫండ్స్‌‌తో కలిపి మొత్తంగా అమెజాన్ పే కు తన పేరెంట్ కంపెనీ రూ.3 వేల కోట్లు ఇచ్చింది. ఈ కంపెనీని 2016లో స్థాపించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రీపెయిడ్ పేమెంట్స్ లైసెన్స్‌‌ పొందాక మొబైల్ వాలెట్ సంస్థను అమెజాన్​ ప్రారంభించింది. అదే సమయంలో యునిఫైడ్ పేమెంట్స్ స్పేస్‌‌లోకి కూడా ఎంటరైంది. యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంలో యూపీఐ పేమెంట్స్‌‌ను ఈ అమెరికన్ సంస్థ ఆఫర్ చేస్తున్నది. కస్టమర్లకు లావాదేవీలను మరింత సులభతరం చేసింది. ఇతర ప్లాట్‌‌ఫామ్స్ ద్వారా కూడా బిల్ పేమెంట్స్, రీఛార్జ్‌‌లు, షాపింగ్‌‌లు వంటి వాటిని ఆఫర్ చేస్తోంది. డిజిటల్ పేమెంట్స్ స్పేస్‌‌లో దేశీయ సంస్థలు ఫోన్‌‌ పే, పేటీఎంలు ఒకవైపు ఉండగా.. అంతర్జాతీయ సంస్థలు గూగుల్ పే, అమెజాన్ పే, వాట్సాప్‌‌ పేలు మరోవైపు ఉన్నాయి. దేశీయ, అంతర్జాతీయ సంస్థల మధ్యే ప్రస్తుత పోటీ నెలకొంది. పేటీఎం, ఫోన్‌‌ పే, గూగుల్ పేలు డిజిటల్ పేమెంట్స్ స్పేస్‌‌లో అగ్రస్థానంలో  ఉన్నాయి.