సీఎం ఆదేశాలతో పనులు వేగవంతం... మూడ్రోజుల్లో కన్సల్టెన్సీ టెండర్లు

సీఎం ఆదేశాలతో పనులు వేగవంతం... మూడ్రోజుల్లో కన్సల్టెన్సీ టెండర్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అమీర్ పేట, మైత్రీవనం ప్రాంతాలపై బల్దియా అధికారుల ఫోకస్ పెట్టారు. భారీ వర్షాలు కురిసిన కూడా ఇక్కడ నీరు నిల్వకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించి ప్లానింగ్ తయారీ కోసం కన్సల్టెన్సీ టెండర్లను జీహెచ్ఎంసీ వేయనుంది. 

ఖైరతాబాద్ జోన్ అధికారులు ఈ మూడ్రోజుల్లో వేయనున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం ఇంజినీరింగ్ అధికారులు చర్చించారు. సీఎం ఆదేశాల మేరకు మధురా నగర్ నుంచి సత్యం థియేటర్ వరకు  భారీ ట్రంక్ లైన్ నిర్మాణానికి ప్రణాళికలు రెడీ చేయనున్నారు. కన్సల్టెన్సీ టెండర్లు పూర్తి కాగానే త్వరలో టెండర్లు వేసి పనులు షురూ చేసేందుకు బల్దియా అధికారులు కసరత్తు చేస్తున్నారు.