కోటక్ మహీంద్రా ఎంఎఫ్, సిటీ గ్రూప్ చేతికి.. హోమ్ ఫస్ట్ ఫైనాన్స్‌‌లో 10% వాటా

కోటక్ మహీంద్రా ఎంఎఫ్, సిటీ గ్రూప్ చేతికి.. హోమ్ ఫస్ట్ ఫైనాన్స్‌‌లో 10%  వాటా

న్యూఢిల్లీ: కోటక్​ మహీంద్రా ఎంఎఫ్​, ఫిడిలిటీ, మోర్గాన్ స్టాన్లీ, సిటీ గ్రూప్ గ్లోబల్, మార్కెట్స్ మారిషస్ వంటి సంస్థలు కలిసి సోమవారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియాలో రూ. 1,307 కోట్లకు 10.64 శాతం వాటాను కొనుగోలు చేశాయి. ఎన్‌‌ఎస్‌‌ఈలో అందుబాటులో ఉన్న బ్లాక్ డీల్ డేటా ప్రకారం, కోటక్​ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్​) హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీలో 50 లక్షల షేర్లను (4.84 శాతం వాటా) కొనుగోలు చేసింది.  హెచ్‌‌ఎస్‌‌బీసీ ఎంఎఫ్​, మోతీలాల్ ఓస్వాల్ ఎంఎఫ్​, కోటక్​ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌‌డీఎఫ్‌‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, నార్వే ప్రభుత్వ పెన్షన్ ఫండ్ గ్లోబల్, బ్యాంక్ ఆఫ్ జపాన్ మాస్టర్ ట్రస్ట్.. హోమ్ ఫస్ట్ ఫైనాన్స్​లో 1.09 కోట్లకు పైగా షేర్లను కొన్నాయి. ఈ షేర్లను ఒక్కొక్కటి సగటున రూ. 1,190.50 ధరతో కొనుగోలు చేశాయి. దీంతో లావాదేవీల విలువ రూ. 1,307.17 కోట్లకు చేరుకుంది.

ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్‌‌బర్గ్ పింకస్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియాలో తనకున్న మొత్తం 10.64 శాతం వాటాను అమ్మేసింది. వార్‌‌బర్గ్ పింకస్ తన అనుబంధ సంస్థ ఆరెంజ్ క్లోవ్ ఇన్వెస్ట్‌‌మెంట్స్ బీవీ ద్వారా హోమ్ ఫస్ట్ ఫైనాన్స్‌‌లో తన వాటాను వదులుకుంది. హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా షేర్లు సోమవారం ఎన్​ఎస్​ఈలో 6.44 శాతం పెరిగి రూ. 1,279.70 వద్ద ముగిశాయి. గత డిసెంబర్​లో, వార్‌‌బర్గ్ పింకస్,  హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ రెండు ప్రమోటర్ సంస్థలు ట్రూనార్త్​ ఫండ్​ వీ, ఎథర్​మారిషస్​ కలిసి రూ. 1,728 కోట్లకు హోం ఫైనాన్స్​లో 19.6 శాతం వాటాను అమ్మాయి.  నవంబర్ 2023లో, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ప్రమోటర్లు - ట్రూ నార్త్ ఫండ్ వీ, ఏథర్ మారిషస్ ఇంకా వార్‌‌బర్గ్ పింకస్ కలిసి హోమ్ ఫస్ట్ ఫైనాన్స్‌‌లో రూ. 753 కోట్లకు 9.8 శాతం వాటాను విక్రయించాయి.