అదానీ చేతికి ఇండమెర్ టెక్నిక్స్‌‌‌‌‌‌‌‌

అదానీ చేతికి ఇండమెర్ టెక్నిక్స్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ప్రైమ్ ఏరో భాగస్వామ్యంతో మెయింటెనెన్స్, రిపేర్ ఓవర్‌‌‌‌‌‌‌‌హాల్ (ఎంఆర్​ఓ) కంపెనీ ఇండమెర్ టెక్నిక్స్‌‌‌‌‌‌‌‌లో 100 శాతం వాటా కొనడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కొనుగోలుతో దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ ఎంఆర్​ఓ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌గా ఎదగనుంది. అదానీ డిఫెన్స్, ప్రైమ్ ఏరో కలిసి ఏర్పాటు చేసిన 'హారిజన్ ఏరో సొల్యూషన్స్ లిమిటెడ్' అనే జాయింట్ వెంచర్ ద్వారా ఈ పెట్టుబడి పెట్టనున్నారు. నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లోని మిహాన్ ప్రత్యేక ఆర్థిక జోన్ (ఎస్​ఈజెడ్​) లో ఉన్న ఇండమెర్ టెక్నిక్స్ అత్యాధునిక సదుపాయాలు కలిగి ఉంది. ఇక్కడ 10 హ్యాంగర్‌‌‌‌‌‌‌‌లలో 15 విమానాలను ఉంచవచ్చు.  ఈ కొనుగోలు ఎంఆర్​ఓ రంగంలో అదానీ సామర్థ్యాలను మరింత పెంచుతుందని అదానీ డిఫెన్స్ తెలిపింది.