సో అండ్ రీప్కు కార్బన్ క్రెడిట్స్.. ఈ క్రెడిట్‌‌‌‌‌‌‌‌లను ఇతర కంపెనీలకు అమ్మొచ్చు !

సో అండ్ రీప్కు కార్బన్ క్రెడిట్స్.. ఈ క్రెడిట్‌‌‌‌‌‌‌‌లను ఇతర కంపెనీలకు అమ్మొచ్చు !

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన క్లైమేట్- టెక్ స్టార్టప్ సో అండ్ రీప్, పర్యావరణ అనుకూల వరి సాగు పద్ధతులను రూపొందించి గోల్డ్ స్టాండర్డ్ కార్బన్ క్రెడిట్స్​ను సాధించించినట్టు ప్రకటించింది. కోషర్ క్లైమేట్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఏడబ్ల్యూడీ పద్ధతిలో వరి సాగు ద్వారా 37,405 గోల్డ్  స్టాండర్డ్  కార్బన్ క్రెడిట్లను సాధించింది. ‘వారి’ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి 35 వేల మంది రైతులు పాల్గొన్నారు. దాదాపు  లక్ష ఎకరాల వరి సాగును ఈ ప్రాజెక్ట్ కవర్ చేసింది. రాబోయే ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లతో వచ్చే రెండు సంవత్సరాల్లో 10 లక్షల కార్బన్ క్రెడిట్‌‌‌‌‌‌‌‌లను సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సంస్థ రైతుల భాగస్వామ్యంతో వరి సాగులో మెరుగైన పద్ధతులను ప్రోత్సహిస్తోంది. దీనివల్ల మీథేన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి.  ఈ విధానం నీటి వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది పర్యావరణానికి చాలా ప్రయోజనకరం. ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించినందుకు లేదా తొలగించినందుకు ఇచ్చే సర్టిఫికెట్లను కార్బన్​ క్రెడిట్లు అంటారు. ఈ క్రెడిట్‌‌‌‌‌‌‌‌లను ఇతర కంపెనీలకు అమ్మవచ్చు.