వరంగల్‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌స్టామార్ట్కు ఆదరణ.. గత 12 నెలల్లో ఏకంగా 292 ఆర్డర్లు ఇచ్చిన కస్టమర్ !

వరంగల్‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌స్టామార్ట్కు ఆదరణ.. గత 12 నెలల్లో ఏకంగా 292 ఆర్డర్లు ఇచ్చిన కస్టమర్ !

హైదరాబాద్​, వెలుగు: తమ సేవలకు వరంగల్​లో డిమాండ్​ పెరుగుతోందని క్విక్ డెలివరీ కంపెనీ ఇన్​స్టామార్ట్​ తెలిపింది. పది -నిమిషాల డెలివరీకి అద్భుతమైన స్పందన లభించిందని, కూల్​డ్రింక్స్, వంటనూనెలు, నెయ్యి అమ్మకాలు 200 శాతం పెరిగాయని ప్రకటించింది. ఒక కస్టమర్​ గత 12 నెలల్లో ఏకంగా 292 ఆర్డర్లు ఇచ్చారని పేర్కొంది. మధ్యాహ్నం వేళల్లో షాపింగ్ ఎక్కువగా జరుగుతోందని,  పండుగల సమయంలో ఆర్డర్లు బాగా పెరుగుతున్నాయని ఇన్​స్టామార్ట్​  సీనియర్ ​ఎగ్జిక్యూటివ్​  ఒకరు చెప్పారు. గత ఏడాది వరంగల్‌‌‌‌‌‌‌‌లో తమ సేవలను  మొదలుపెట్టామని చెప్పారు. కిరాణా సామాన్లూ భారీగా అమ్ముడవుతున్నాయన్నారు.