
హైదరాబాద్, వెలుగు: తమ ప్లాట్‌ఫారమ్ ద్వారా వస్తువులను అమ్ముతున్న సెల్లర్ల రిఫరల్ ఫీజులను భారీగా తగ్గించామని ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ప్రకటించింది. కొత్త రేట్లు గత నెల ఏడో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపింది. అమెజాన్ ఇండియా డైరెక్టర్ (సేల్స్) గౌరవ్ భట్నాగర్ హైదరాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘రూ. 300 కంటే తక్కువ ధర కలిగి ఉన్న 1.2 కోట్లకు పైగా ఉత్పత్తులపై రెఫరల్ ఫీజులను తొలగించాం.
135కిపైగా ఉత్పత్తి విభాగాలకు ఫీజులను తీసుకోవడం లేదు. జాతీయ షిప్పింగ్ రేట్లను రూ.77 నుంచి రూ.65కు తగ్గించాం. కిలో కంటే తక్కువ బరువున్న తేలికైన వస్తువులకు బరువు నిర్వహణ చార్జీని రూ. 17 వరకు తగ్గించాం. తెలంగాణలో మాకు 50 వేల మంది సెల్లర్లు ఉన్నారు. ఫీజుల తగ్గింపు వల్ల సెల్లర్లకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది”అని గౌరవ్ వివరించారు.