- ఈ వారం నుంచే తొలగింపులు మొదలు
- ఈ ఏడాది ఇప్పటిదాకా 98 వేల మందిని తీసేసిన 200కు పైగా టెక్ సంస్థలు
- ఇండియాలోనూ 1,100 మందిపై వేటు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్కంపెనీ అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా 30 వేల మందికి తొలగించనున్నట్టు ప్రకటించింది. మనదేశంలో 900 నుంచి 1,100 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఈ వారం నుంచే తొలగింపులు మొదలవుతాయని తెలిపింది. కంపెనీ సీఈఓ ఆండీ జస్సీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి ఏఐ, ఆటోమేషన్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.
ఏఐ వల్ల కొన్ని పనులు ఆటోమేటిక్‌గా జరుగుతాయి. దీంతో ఆయా విభాగాల్లో తక్కువ మంది ఉద్యోగులు అవసరం అవుతారు. 2022లో సుమారు 27 వేల మందిని తొలగించిన తర్వాత, అమెజాన్‌లో ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు ఇదే మొదటిసారి. ఫలితంగా హ్యూమన్ రిసోర్సెస్, ఆపరేషన్స్, డివైజెస్, సర్వీసెస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి విభాగాలపై ప్రభావం ఉంటుంది. బాధిత ఉద్యోగులకు సెవెరెన్స్ పే, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు ఇస్తారు. ఇండియా మార్కెట్లో డెలివరీలను వేగవంతం చేయడానికి, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కంపెనీ ఈ ఏడాది రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది 200కు పైగా టెక్ కంపెనీ సుమారు 98 వేల మంది ఉద్యోగులను తొలగించాయి.
