ఏపీలో బాబు, లోకేశ్, పవన్ లు టూరిస్టులు: అంబటి రాంబాబు

ఏపీలో బాబు, లోకేశ్, పవన్ లు టూరిస్టులు: అంబటి రాంబాబు

తుఫాన్ పై ప్రభుత్వం ముందస్తు చర్యలతో తీవ్రనష్టం తప్పిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డిసెంబర్ 10వ తేదీ తాడేపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రతి సంక్షోభాన్ని రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. సీఎం జగన్ పై చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. తుఫాన్ బాధితులను సీఎం జగన్ పరామర్శించడాన్ని కూడా చంద్రబాబు తప్పుబడుతున్నారని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో తుఫాన్ లు వచ్చినప్పుడు చంద్రబాబు ఎంత నష్టపరిహారం  ఇచ్చారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో కొత్త  ప్రాజెక్టులు కట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, డుంగ్లకమ్మ ప్రాజెక్టుకు ప్రారంభించింది కూడా వైఎస్సారే అన్నారు. టీడీపి అలసత్వం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నష్టం జరిగిందని ఆరోపించారు. 

చంద్రబాబులా షో చేయడం జగన్ కు అలవాటు లేదన్నారు.. హెక్టార్ కు  రూ.17వేల నష్టపరిహారం ఇస్తున్నామని తెలిపారు.  డ్యామ్ సేఫ్టీ కమిటీ నివేదికలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని.. అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.5కోట్లు ఖర్చు పెట్టి బ్యూటిఫికేషన్ చేసింది తప్ప రిపేర్లు చేయలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ లు ఇక్కడికి వచ్చి మాట్లాడి హైదరాబాద్ కు వెళ్లిపోతారని.. ఎపిలో టూరిస్టుల్లా వారు వచ్చి పోతారని అంబటి  రాంబాబు ఎద్దేవా చేశారు.