చెన్నై సూపర్ కింగ్స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్ కావాలి: అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు

చెన్నై సూపర్ కింగ్స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్ కావాలి: అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ కు సెపరేట్ క్రేజ్ ఉంది. ఐపీఎల్ లో ఈ రెండు జట్లకు  చిరకాల ప్రత్యర్థులుగా పేరుంది. ప్రారంభ ఎడిషన్ నుంచి ఇప్పటివరకు ఈ టాప్ జట్లు తలపడితే ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ అనే చెప్పాలి. ఓ వైపు ఆల్ టైం బెస్ట్ కెప్టెన్ ధోనీ.. మరోవైపు ఐపీఎల్ లోనే బెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యర్థులుగా కనిపిస్తున్నారంటే.. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ను ఎంజాయ్ చేయడానికి అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇదిలా ఉంటే.. తాజాగా అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ తరపున రోహిత్ కెప్టెన్ గా ఉండాలని తన మనసులోని మాటను బయట పెట్టాడు. 

ALSO READ: David Miller: ప్రేయసిని పెళ్లాడిన డేవిడ్ మిల్లర్.. ఫోటోలు వైరల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాలని మాజీ ముంబై ఇండియన్స్ ఆటగాడు అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనీ రిటైరైతే రోహిత్ నాయకత్వం వహించగలడని.. మరో 5 లేదా 6 ఏళ్ళు  రోహిత్ ఐపీఎల్ ఆడతాడని అన్నాడు. రోహిత్ ఏ జట్టుకు కెప్టెన్ అవ్వాలనుకున్నా అవ్వగలడని న్యూస్ 24 స్పోర్ట్స్‌తో చెప్పాడు ఈ హైదరాబాదీ క్రికెటర్  చెప్పుకొచ్చాడు. రాయుడుకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో మంచి అనుబంధం ఉంది.  కొంతమంది నెటిజన్స్ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ కు రోహిత్ కెప్టెన్ కావాలని ఆశిస్తున్నారు. 

రోహిత్ 2009లో హైదరాబాద్ టీం డెక్కన్ ఛార్జర్స్ జట్టులో ప్లేయర్ గా ఉన్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ 2011లో ముంబై ఇండియన్స్‌లో చేరాడు.  సచిన్ వారసుడిగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్.. ముంబై జట్టును 5సార్లు ఛాంపియన్ గా నిలిపాడు. 2024 ఐపీఎల్ లో హార్దిక పాండ్యను కెప్టెన్ గా ప్రకటించడంతో రోహిత్ ను వేరే ఫ్రాంచైజీకి వెళ్లాల్సిందిగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు 234 మ్యాచ్ ల్లో హిట్ మ్యాన్ ఒక సెంచరీ, 42 హాఫ్ సెంచరీలతో 6000కు పైగా పరుగులు చేశాడు.