ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి వేడుకలకు రండి..గవర్నర్‌‌ కు ఓపెన్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి ఆహ్వానం

ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి వేడుకలకు రండి..గవర్నర్‌‌ కు ఓపెన్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ నెల14న నిర్వహించే అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను వర్సిటీ వైస్ చాన్సలర్ (వీసీ) ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆహ్వానించారు. 

మంగళవారం లోక్‌‌భవన్‌‌లో గవర్నర్‌‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఆహ్వాన పత్రికను అందజేశారు. వర్సిటీలో నిర్వహిస్తున్న సామాజిక సాధికారత వారోత్సవాల వివరాలను గవర్నర్‌‌కు వివరించారు. ట్రాన్స్‌‌జెండర్ విద్యార్థులకు అందిస్తున్న ఉచిత విద్య గురించి తెలిపారు.