పెద్దపల్లి కలెక్టర్ కుల వివక్ష చూపుతున్నరు.. మంత్రి వివేక్ వెంకటస్వామికి అంబేద్కర్ సంఘం నాయకుల ఫిర్యాదు

పెద్దపల్లి కలెక్టర్ కుల వివక్ష చూపుతున్నరు.. మంత్రి వివేక్ వెంకటస్వామికి అంబేద్కర్ సంఘం నాయకుల ఫిర్యాదు

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు కలెక్టర్​శ్రీహర్ష అడ్డుపడుతూ.. కుల వివక్ష చూపుతున్నారని ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామిని ఆదివారం హైదరాబాద్​లోని ఆయన నివాసంలో కలిసి ఫిర్యాదు చేశారు.

 సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, ఉపాధ్యక్షుడు మైస రాజేశ్​మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏప్రిల్​5 నుంచి14వ తేదీ వరకు జరిగిన బాబూ జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సంబంధించి దరఖాస్తు ఇచ్చేందుకు వెళ్లిన దళిత నాయకులతో కలెక్టర్​అవహేళనగా మాట్లాడారని అన్నారు.

 ప్రధాన రహదారులపై కొత్తగా ఎలాంటి విగ్రహాలు పెట్టవద్దనే సర్క్యులర్​ను చూపుతూ.. జిల్లాలో అంబేద్కర్ విగ్రహాలను పెట్టకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు. దీనికి సుల్తానాబాద్ మండలం మంచెరామి గ్రామమే సాక్ష్యమని పేర్కొన్నారు. కలెక్టర్​వ్యవహార శైలిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని మంత్రికి విన్నవించారు.