
న్యూఢిల్లీ, వెలుగు : కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ఫొటోను ముద్రించేలా సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి (సీఏపీఎస్ఎస్) అధ్యక్షులు డా. జేరిపోతుల పరశురామ్ విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో సీఏపీఎస్ఎస్ నేత ఆళ్ల రామకృష్ణ తో కలిసి సీఎం రేవంత్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పరశురామ్ మాట్లాడుతూ... కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలనే అంశాన్ని రేవంత్ రెడ్డి ఎంపీగా లోక్ సభలో లేవనెత్తారని , ఇప్పుడు ఈ అంశంపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరినట్లు చెప్పారు.