
- కేసు ఫైల్ చేసిన హనుమకొండ పోలీసులు
హనుమకొండ, వెలుగు: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో అంబులెన్స్ డ్రైవర్ హనుమకొండ పోలీసులకు చిక్కాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. మంచిర్యాల జిల్లా సింగరేణి కాలరీస్ కు చెందిన అంబులెన్స్ డ్రైవర్ సూరపాక ప్రశాంత్ సోమవారం పేషెంట్ ను తీసుకుని వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చాడు.
అనంతరం తిరిగి వెళ్తుండగా హనుమకొండ అశోక జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆపి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. దీంతో అంబులెన్స్ డ్రైవర్ ప్రశాంత్ మద్యం తాగి బండి నడుపుతున్నట్లు నిర్ధారణ అయింది. అనంతరం డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి తెలిపారు.