ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: పాండురంగారెడ్డి

ఉచిత వైద్య శిబిరాలను  సద్వినియోగం చేసుకోవాలి:  పాండురంగారెడ్డి
  • మున్సిపల్​ మాజీ చైర్మన్​ పాండురంగారెడ్డి 

అమీన్​పూర్, వెలుగు: పేద, మధ్య తరగతి వాళ్లు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్​ మాజీ చైర్మన్​ పాండురంగారెడ్డి సూచించారు.  ఆదివారం మున్సిపల్​ పరిధిలోని 17వ వార్డులో క్రోమ్​ వెల్​ ఆస్పత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 

అనంతరం ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. శారీరక శ్రమ అవసరమని, ప్రతీ రోజు వాకింగ్​, యోగా చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్​ మల్లేశ్​, నాయకులు యాదగిరి, హాస్పిటల్​ ప్రతినిధులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.