అమీన్ పూర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్ పూర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి 

అమీన్​పూర్​, వెలుగు: అమీన్​పూర్​మున్సిపాలిటీని అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపల్​ పరిధిలోని ఐదో వార్డు ఆర్టీసీ కాలనీలో రూ. కోటి అంచనా వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు పనులను స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..మున్సిపల్, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తూ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామన్నారు.

 ప్రతీ కాలనీలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కాలనీల మధ్య అంతర్గత రోడ్లు నిర్మిస్తూ రవాణా సౌకర్యాన్ని మెరుగు పరుస్తున్నామన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్​మాజీ చైర్మన్​ పాండురంగారెడ్డి, మాజీ కౌన్సిలర్లు మహదేవరెడ్డి, కొల్లూరి మల్లేశ్, గోపాల్, కాలనీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.  

 ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

పటాన్​చెరు నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి తెలిపారు. మున్సిపల్​ పరిధిలోని గ్రీన్​ మెడోస్​ కాలనీలో నిర్మించే రామాలయ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలిసి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం కాలనీ కమ్మూనిటీ  హాల్​ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.