అడ్రస్ మారిపోయిన అమీర్‌పేట్, టోలీచౌకీ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు.. ఎక్కడికంటే...?

అడ్రస్ మారిపోయిన అమీర్‌పేట్, టోలీచౌకీ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు.. ఎక్కడికంటే...?

పాస్ పోర్ట్ పొందాలనుకునే వ్యక్తులు అందుకోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎంపిక చేసుకున్న పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి ఇంటర్వ్యూ కోసం వెళుతుంటారు. ఇవి విదేశాంగ శాఖ ఏర్పాటు చేస్తుంటుంది. కేవలం గుర్తింపు పొందిన కేంద్రాల ద్వారా మాత్రమే ప్రజలు పాస్ పోర్ట్ పొందటానికి వీలుంటుంది. తాజాగా హైదరాబాద్ నగరంలోని రెండు పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు ప్రస్తుతం ఉన్న చోటి నుంచి వేరే చోట్లకు మార్చబడుతున్నాయి.

అమీర్ పేట్, టోలీచౌకీ ప్రాంతంలోని పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు కొత్త ప్రదేశాలకు మారాయి. సెప్టెంబర్ 16 నుంచి అమీర్ పేట్ ఆదిత్య ట్రేడ్ సెంటర్ లోని పాస్ పోర్ట్ కేంద్రం ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ వద్దకు మార్చబడింది. ఇదే సమయంలో టోలీచౌకీ షేక్ పేట్ నాలా ఆనంద్ సిలికాన్ చిప్ వద్ద ఉన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని రాయదుర్గం ప్రాంతంలోని పాత ముంబై రోడ్ సిరి బిల్డింగ్ లోకి మార్చబడింది. రేపు అంటే సెప్టెంబర్ 16 నుంచి కొత్తగా మార్చబడిన ప్రాంతాల నుంచి ఇవి సేవలను అందిస్తాయని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. 

►ALSO READ | దేశవ్యాప్తంగా దసరా నవరాత్రిళ్లు వైభవంగా జరిగే ఆలయాలు ఇవే..!

వాస్తవానికి 2011 నవంబరులో విదేశీ వ్యవహారాల శాఖ హైదరాబాద్ నగరంలో బేగంపేట్, అమీర్ పేట్, చోలీచౌక్ ప్రాంతాల్లో పాస్ పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వేల మంది అప్లికెంట్ల సౌకర్యం దృష్ట్యా కొత్త ప్రాంతాలకు ఆఫీసులను మార్చినట్లు వెల్లడైంది. MGBS మెట్రో స్టేషన్, రాయదుర్గంలోని రెండు పాస్ పోర్ట్ కేంద్రాలు పెరిగిన రద్దీని నిర్వహించడానికి, దరఖాస్తుదారుల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడంతో పాటు మెరుగైన సౌకర్యాలను అందించడానికి మెరుగైన మౌలిక సదుపాయాలతో అమర్చబడిందని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి జె స్నేహజ తెలిపారు.