ఇండియాకు సాయంగా ఉంటం

ఇండియాకు సాయంగా ఉంటం

వాషింగ్టన్: ఇండియాకు అమెరికా ఎప్పుడూ అండగా ఉంటుందని బైడెన్​ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్పష్టంచేశారు. అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతున్నాసరే రష్యా నుంచి ఇండియా, మరికొన్ని ఆసియా దేశాలు క్రూడాయిల్​ను దిగుమతి చేసుకుంటున్నాయని, ఈ విషయంలో ఇండియా అధికారులతో చర్చలు జరిపారా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు వారు స్పందించారు. మాస్కోతో ఇండియా రిలేషన్స్ ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని, ఇండియన్​ గవర్నమెంట్​ను భాగస్వామిగా చేసుకునేందుకు అమెరికా సిద్ధంగా లేనప్పుడూ ఆ రెండు దేశాల మధ్యా సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇండియా ప్రతినిధులతో తాము చాలాసార్లు చర్చలు జరిపామని, అయితే మాస్కోతో ఒక్కో దేశం ఒక్కో రకమైన సంబంధాలు కలిగి ఉందనే విషయం తమకు తెలుసని అమెరికా స్టేట్​ డిపార్ట్ మెంట్​ ప్రతినిధి నెడ్​ ప్రైస్​ మీడియాకు చెప్పారు. ప్రస్తుతం సౌది అరేబియా కంటే ఎక్కువగా ఇండియా రష్యా నుంచి ఆయిల్​ ను దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్​ యుద్ధం కారణంగా క్రూడాయిల్​ ధరలు పెరిగినా.. భారీ డిస్కౌంట్​తో రష్యా ఇండియాకు క్రూడాయిల్​ను సరఫరా చేస్తోంది.