కరోనా మృతుల్లో అగ్రరాజ్యానికే అగ్రభాగం

కరోనా మృతుల్లో అగ్రరాజ్యానికే అగ్రభాగం

అన్ని దేశాలలోకెల్లా అగ్రరాజ్యంగా ఫీలయ్యే అమెరికా.. కరోనా మృతుల్లోనూ అగ్రభాగాన్ని దక్కించుకుంది. అమెరికాలో కరోనా వల్ల చనిపోయిన వారిసంఖ్య 20 వేలు దాటింది. దాంతో కరోనా మృతుల్లో అమెరికా టాప్ ప్లేస్ లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న కరోనా వల్ల ఇప్పటివరకు 108,834 మంది చనిపోయారు. చైనాలో మొదలయిన ఈ వైరస్ వల్ల 3,339 మంది చనిపోయారు. చైనా నుంచి వ్యాపించిన ఇటలీలో 19,468 మంది చనిపోయారు. స్పెయిన్ లో 16,606 మంది చనిపోయారు. ఆ తర్వాత ఫ్రాన్స్ లో 13,832 మంది చనిపోయారు. కాగా.. లేట్ గా వచ్చినా లేటెస్ట్ అన్నట్లు.. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య ఈ దేశాలన్నింటిని దాటిపోయింది. అక్కడ కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 20,577కు చేరింది. దాంతో అమెరికా కరోనా మృతుల విషయంలో అన్ని దేశాలనుదాటి మొదటి స్థానానికి ఎగబాకింది. ఒక్కరోజులో 2,108 మంది చనిపోయారు. ఇప్పటిదాకా ఇదే రికార్డ్. 3 రోజులుగా రోజూ 2 వేల మందికిపైగా బలవుతున్నారు. కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. మొత్తంగా దేశంలో 5,21,000 మంది వైరస్ బారిన పడ్డారు. దీన్ని బట్టి చూస్తే అగ్రరాజ్యం ఎందులోనూ అగ్రభాగాన్ని వదులుకోదేమో అనిపిస్తోంది.

For More News..

24 గంటల్లో 34 మరణాలు, 909 కొత్త కేసులు

మా వాళ్లను ఇబ్బంది పెట్టారో.. ఖబడ్దార్

ఇనకపోతే పోలీసోళ్లు కొడుతరిక

ఎన్ని కణాలుంటే వైరస్ సోకుతుందో తెలుసా..

లాక్ డౌన్ ఎత్తేయాలంటే ఈ ఆరు ఖచ్చితంగా చేయాలి..