టెంపరరీగా హెచ్ 1 బీ వీసాల బ్యాన్ !

టెంపరరీగా హెచ్ 1 బీ వీసాల బ్యాన్ !
  • ట్రంప్ అడ్మినిస్ట్రేటషన్ కసరత్తు

వాషింగ్టన్ : అమెరికా లో కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉండటంతో దాని ప్రభావం హెచ్ 1 బీ వీసా లపై పడనుంది. లాక్ డౌన్ కారణంగా దేశంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోవటంతో కొత్తగా వర్క్ వీసాలను కొన్ని నెలల పాటు బ్యాన్ చేయాలని అమెరికా యోచిస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు రూపొందించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో అన్ ఎంప్లాయిమెంట్ రేటు 14.6 శాతానికి చేరింది. కొన్ని రోజులుగా దాదాపు 3 కోట్లకు పైగా అమెరికన్లు అన్ ఎంప్లాయ్ మెంట్ ప్రయోజనాల కోసం అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. దీంతో ఉద్యోగాల్లో ఫస్ట్ ప్రియారిటీ అమెరికన్లకే దక్కాలన్న ఉద్దేశంతో హెచ్ 1 బీ వర్కింగ్ వీసాలను టెంపరరీగా నిషేధించనున్నారు. హెచ్‌-1 బీ‌, తో పాటు చదువుకునేందుకు వెళ్లి అక్కడ ఉద్యోగం చేసే అవకాశం కల్పించే హెచ్‌-2 బీ వీసా ల కఠిన నిర్ణయం తీసుకోనున్నారు. వీరికి పనిచేసేందుకు అవకాశం లేకుండా ఆదేశాలు జారీ చేయనున్నారు. అమెరికాకు వెళ్లే చాలా మంది స్టూడెంట్స్ అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేస్తూ చదవుకుంటారు. లేదంటే అక్కడి ఖర్చులను భరించటం సాధ్యమయ్యే పనికాదు. కానీ హెచ్ 2 బీ వీసా లపై వెళ్లే విద్యార్థులకు పనిచేసే అవకాశం ఇవ్వకపోతే వారికి ఇబ్బందులు తప్పవు. కొత్త గా హెచ్ 1బీ, హెచ్ 2 బీ వీసాలు ఇవ్వకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ‘‘వర్క్‌ బేస్డ్‌ వీసాలపై తాత్కాలిక నిషేధం విధించేలా ఇమ్మిగ్రేషన్‌ అడ్వైజర్స్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ వీసాల జాబితాలో హెచ్‌-1 బీ, హెచ్‌2 -బీ, విద్యార్థి వీసాలు కూడా ఉంటాయని కొంతమంది అధికారులు చెబుతున్నారు.
ఇండియన్స్ కే ఎఫెక్ట్
హెచ్ 1 బీ, హెచ్ 2 బీ వీసాలను టెంపరరీగా నిలిపివేస్తే ఇండియన్స్ కే ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. హెచ్ 1 బీ వర్క్ వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలు చేసే వారిలో మన వారి సంఖ్యే ఎక్కువ. ప్రముఖ కంపెనీలు ప్రొఫెషనల్ ఎక్స్ ఫర్ట్ పేరుతో మన వారికి హెచ్ 1 బీ వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగం చేసే చాన్స్ కల్పిస్తాయి. ఏటా దాదాపు లక్ష మంది కి పైగా మన దేశం నుంచి ఈ వీసాలపై అమెరికా వెళ్తుంటారు. అమెరికన్లతో పోల్చుకుంటే తక్కువ జీతానికే మన వాళ్లు పనిచేయటంతో అమెరికా కంపెనీలు కూడా ఇండియన్స్ కే ప్రిపరేన్స్ ఇస్తాయి. ఇక అమెరికాలో చదివే స్టూడెంట్లలోనూ మన వారి సంఖ్య ఎక్కువ. టెంపరరీగా వీసా లు రద్దు చేస్తే అమెరికా చదువుకునేందు వెళ్లే వారికి ఆ అవకాశం లేకుండా పోనుంది.