చైనా కంపెనీలకు అమెరికా మళ్లీ షాక్

చైనా కంపెనీలకు అమెరికా మళ్లీ షాక్

బ్లాక్ లిస్టులో మరో 28 కంపెనీలు 
వాషింగ్టన్: చైనా కంపెనీలకు అమెరికా మళ్లీ షాకిచ్చింది. జో బైడెన్ సర్కార్ మరో 28 కంపెనీలను బ్లాక్ లిస్టులో చేర్చింది. ఈ మేరకు వైట్ హౌస్ గురువారం ఆర్డర్ రిలీజ్ చేసింది. ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టొద్దని అమెరికన్లకు స్పష్టం చేసింది. చైనా మిలటరీతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో వాటిపై వేటు వేసింది. ఆ కంపెనీలు చైనా సర్వైలెన్స్ టెక్నాలజీని వినియోగించుకొని.. తమ దేశం, తమ మిత్ర దేశాల సెక్యూరిటీకి ముప్పు కలిగిస్తున్నాయని వైట్ హౌస్ పేర్కొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన హయాంలో 31 చైనా కంపెనీలను బ్లాక్ లిస్టులో చేర్చారు. దీంతో బ్లాక్ లిస్టులో చేరిన చైనా కంపెనీల సంఖ్య 59కి చేరింది. కాగా, అమెరికా నిర్ణయంపై చైనా మండిపడింది. రాజకీయ దురుద్దేశంతోనే కంపెనీలను బ్లాక్ లిస్టులో చేర్చిందని, రూల్స్ పాటించలేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ ఆరోపించారు.