గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు.. వాళ్లందరూ బతికి ఉన్నారా?

గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు.. వాళ్లందరూ బతికి ఉన్నారా?

అమెరికన్ ఎయిర్ లైన్స్ ఫీనిక్స్ గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఓ పక్షిని ఢీకొట్టింది. దీంతో ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన విమానం సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. మరో విమానంలో వారిని పంపిచామని చెప్పారు. ఆకాశంలో విమానం ఇంజన్ కు నిప్పంటుకున్న దృశ్యాలు ప్రస్తుతం ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేస్తోంది.

ఓహియో విమానాశ్రయం నుంచి ఏప్రిల్ 23న బోయింగ్ 737 ఫ్లైట్ ఫినిక్స్ కు బయలుదేరిందని అధికారులు తెలిపారు. టేకాఫ్ అయిన 30 నిమిషాల్లోనే విమానం ఇంజన్ లో మంటలు చెలరేగాని, అందుకే ఫ్లైట్ ను తిరిగి ల్యాండ్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో ఓహియోలోని జాన్ గ్లెన్ కొలంబస్ ఎయిర్ పోర్టులోనూ ఎమర్జెన్సీ ప్రకటించారు. అంతే కాకుండా విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యేంత వరకూ ఇతర విమానాల రాకపోకలను నిలిపేశారు. ఫ్లైట్ ల్యాండయిన వెంటనే సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.