చెన్నై:వెహికల్స్ ఎగుమతుల కోసం చెన్నై ప్లాంట్‌ను ఉపయోగించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికన్ ఆటో మేజర్ ఫోర్డ్ మోటార్ శుక్రవారం తెలిపింది. తమిళనాడు ప్రభుత్వానికి ఇదే విషయాన్ని తెలియజేసింది.
పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌తో కలిసి అమెరికాలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్‌బీ రాజా ఈ విషయాన్ని ప్రకటించించారు. చెన్నై ప్లాంట్‌ను విదేశీ మార్కెట్‌లకు అందించడానికి ఉపయోగించాలనే ఉద్దేశ్యాన్ని సూచిస్తూ లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను సమర్పించినట్లు ఫోర్డ్తెలిపింది.
కంపెనీ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సెప్టెంబర్ 2021లో ఇండియాలో తన వెహికల్స్ తయారీని నిలిపివేసింది.