హెల్ప్ చేయమంటే చంపేశారు

హెల్ప్ చేయమంటే చంపేశారు

హెల్ప్ చేయమంటే చంపేశారు

అమెరికాలో పోలీసుల అమానుషం

రోచెస్టర్: జార్జ్ ఫ్లాయిడ్ ఘటనను మరవకముందే అమెరికా పోలీసులు దారుణంగా వ్యవహరించిన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. మెంటల్ హెల్త్ సరిగా లేని డానియల్ ఫ్రూడ్ అనే 41 ఏళ్ల నల్లజాతీయుడు పోలీసుల అమానుషానికి బలైపోయాడు. ఫ్రూడ్ మార్చి 23న  ఇంటి నుంచి నగ్నంగా న్యూయార్క్ రోడ్లపైకి వెళ్లాడు. ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేయాలంటూ పోలీసులకు కాల్ చేశారు. అతడిని ఓ రోడ్డుపై పట్టుకున్న పోలీసులు.. చేతులు వినక్కి విరిచి, రోడ్డుపై పడేసి మోకాలితో తొక్కి పెట్టారు. అతని తలపై స్పిట్ హుడ్ (నిందితులు ఉమ్మినా, దగ్గినా ఉమ్ము, తుంపర్లు పడకుండా కప్పే మాస్కే స్పిట్ హుడ్)ను పెట్టారు. ఫ్రూడ్ ఎదురుతిరగడంతో అతని తలను గోడకోసి కొట్టారు. వదిలేయాలని ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదు. దీంతో అన్ కాన్షియస్ లోకి వెళ్లిపోయాడు. ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ వారం తర్వాత చనిపోయాడు. ఫ్లాయిడ్ ఘటనకు 2 నెలల ముందు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ను  ఫ్రూడ్ ఫ్యామిలీ విడుదల చేసింది.

For More News..

కరోనా రూల్స్​ పాటించలేదని 2 లక్షల చలాన్లు

టూరిస్ట్​ సెంటర్​గా మారనున్న పీవీ ఊళ్లు

5వేల కోసం మందు తాగించి చంపిండు