ఇడ్లీ సాంబార్ అంటే మస్త్ ఇష్టం.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి

ఇడ్లీ సాంబార్ అంటే మస్త్ ఇష్టం.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి

నార్త్ ఇండియాలో టిక్కా బాగుంటది
తాతయ్యతో కలిసి ‌మద్రాస్ లో తిరగడం మరవలేను: కమలా హారిస్

న్యూయార్క్: ‘‘మాంచి సాంబార్ తో కలిపి ఇడ్లీ తింటే మస్త్ ఉంటది. నార్త్ ఇండియాలో ఏ రకమైన టిక్కా అయినా నోరూరిస్తది. చిన్నప్పుడు తాతయ్యతో కలిసి మద్రాస్ వీధుల్లో తిరగడం మరచిపోలేను..” అని అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న కమలా హారిస్ చెప్పారు. ఇండియన్ ఆరిజిన్ లీడర్ అయిన కమల.. ఇండియాతో తనకు ఉన్న అనుబంధాన్ని ఇన్ స్టాగ్రామ్ యూజర్లతో పంచుకున్నారు. యూజర్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ఆ వీడియోను ఆదివారం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  తన తల్లి వల్లే తనకు సౌత్ ఇండియా వంటకమైన ఇడ్లీ సాంబార్ ఫేవరేట్ డిష్ గా మారిందన్నారు. జో బిడెన్ తో కలిసి క్లైమేట్ చేంజ్ నివారణకు పని చేస్తానని, 2050 నాటికి జీరో ఎమిషన్స్ దిశగా తాము ప్లాన్ రూపొందించామని తెలిపారు. మహిళలకు ఎవరి సలహాలూ, పర్మిషన్లు అక్కర్లేదని, వారు అనుకున్నది చేస్తూ ముందుకు వెళ్లాలన్నారు. చాలా చోట్ల ఒకటి రెండు ఓట్లతోనే పరిస్థితి తారుమారు అవుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు. కమల తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడుకు చెందినవారు. క్యాన్సర్ బయాలజిస్ట్ అయిన శ్యామల యూఎస్ లో సెటిల్ అయ్యారు. అక్కడే జమైకాకు చెందిన ఎకనామిస్ట్ డొనాల్డ్ జె. హారిస్ ను పెళ్లి చేసుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ఎన్నికల బరిలోకి దిగిన తొలి ఇండియన్ ఆరిజిన్ లీడర్, బ్లాక్ మహిళగా కమల నిలిచారు. ఎన్నికల్లో గెలిస్తే ఆమె యూఎస్ కు తొలి ఇండియన్ ఆరిజిన్, బ్లాక్ మహిళా వైస్ ప్రెసిడెంట్ కానున్నారు.

For More News..

చలికాలంలో న్యుమోనియాను అడ్డుకోండిలా..