
ఓ మహిళ తన హ్యాండ్ బ్యాగ్ లో ఆరు రోజుల వయసున్న బిడ్డను తరలిస్తూ ఎయిర్ పోర్ట్‌లో దొరికిపోయింది. ఈ ఘటన ఫిలిపిన్స్ లోని మనీలా ఎయిర్ పోర్ట్‌లో జరిగింది. అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జెన్నిఫర్ ఎరిన్ టాల్‌బోట్(43) అనే అమెరికా మహిళ బుధవారం పొద్దున మనీలా విదేశాలకు వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్ కు చేరుకుంది. దీంతో అక్కడి అధికారులు జెన్నిఫర్ ను చెక్ చేయగా ఆమె బ్యాగ్ లో ఆరు రోజుల చిన్నారి కనిపించింది. దీంతో అధికారులు జెన్నిఫర్ ను అరెస్ట్ చేశారు. అయితే ఆ చిన్నారికి తాను అత్తను అవుతానని చెప్పిందని తెలిపారు అధికారులు.. ఇందుకు ఎటువంటి ఆదారాలు చూయించలేనందున కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.