ఓటేసిన అమెరికా..న్యూ హాంప్‌‌షైర్‌‌లో తొలి ఓటు

ఓటేసిన అమెరికా..న్యూ హాంప్‌‌షైర్‌‌లో తొలి ఓటు

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ మంగళవారం స్టార్టయింది. ఇండియా టైమ్‌ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు (అక్కడి టైమ్‌ ఉదయం 5.00 గంటలు) వెర్మాంట్‌ రాష్ట్రంలో పోలింగ్‌ స్టేషన్లను ఓపెన్‌ చేశారు. అమెరికా వ్యాప్తంగా ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు క్యూ కట్టారు. పోలింగ్‌ సందర్భంగా హింస జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వైట్‌హౌస్‌, దేశంలోని పెద్ద షాపింగ్‌ మాల్స్‌, కమర్షియల్‌ ప్లేస్‌లకు సెక్యూరిటీ పెంచారు.

న్యూయార్క్‌‌: ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌‌ మంగళవారం పూర్తయింది. ఎప్పటిలాగే న్యూ హాంప్‌‌షైర్‌‌లో అర్ధరాత్రి తొలి ఓటు నమోదైంది. ఆ తర్వాత మన టైమ్‌‌ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు (అక్కడి టైమ్‌‌ ఉదయం 5.00 గంటలు) వెర్మాంట్‌‌ రాష్ట్రంలో పోలింగ్‌‌ స్టేషన్లను ఓపెన్‌‌ చేశారు. అమెరికావ్యాప్తంగా ఓటర్లు పోలింగ్‌‌ బూత్‌‌ల ముందు క్యూ కట్టారు. పోలింగ్‌‌ సందర్భంగా హింస జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వైట్‌‌హౌస్‌‌, దేశంలోని పెద్ద షాపింగ్‌‌ మాల్స్‌‌, కమర్షియల్‌‌ ప్లేస్‌‌లకు సెక్యూరిటీ పెంచారు. ప్రెసిడెన్షియల్‌‌ కాంప్లెక్స్‌‌ చుట్టూ పెద్ద ఫెన్స్‌‌ను టెంపరరీగా నిర్మించారు. రిజల్ట్స్‌‌ ఎలా వస్తే ప్రజలు ఎలా స్పందిస్తారోననే టెన్షన్​తో చాలా ప్రాంతాల్లో రిటైల్‌‌ స్టోర్స్‌‌ ఓనర్లు షాపులు ధ్వంసం కాకుండా చెక్కలను రెడీగా పెట్టుకున్నారు.

రిజల్ట్‌‌ లేటైతదా?

చివరి విడత ప్రచారం ముగించుకొని ప్రెసిడెంట్‌‌ ట్రంప్‌‌ వైట్‌‌హౌస్‌‌కు చేరుకున్నారు. అక్కడి నుంచే పోలింగ్‌‌ను పరిశీలిస్తున్నారు. కరోనా కారణంగా ఓటర్లు వీలైనంత త్వరగా ఓటేయాలని, మెయిల్‌‌ ఓటింగ్‌‌ను వాడుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే కోరింది. వైరస్‌‌ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈసారి పది కోట్ల మంది అమెరికన్లు మెయిల్‌‌ ఓటింగ్‌‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఫలితాలు ఆలస్యం కావొచ్చని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెబుతున్నారు. బ్యాలట్‌‌ ఓట్లను వెంటనే లెక్కించే అవకాశమున్నా మెయిల్ బ్యాలెట్ల లెక్కింపు శ్రమతో కూడుకున్న పని అంటున్నారు. పైగా ఎన్నికల రోజు వరకు మెయిల్ బ్యాలెట్లను ప్రాసెస్ చేయకూడదని రూల్‌‌ ఉంది కాబట్టి రిజల్ట్స్‌‌ లేటవొచ్చంటున్నారు.

ఎవరికి వారు ధీమా

ప్రజలు తనను మరోసారి గెలిపిస్తారని ట్రంప్‌‌ ధీమాగా ఉన్నారు. పోలింగ్ కు ముందు తన సపోర్టర్లకు థాంక్యూ మెసేజ్‌‌ ఇచ్చారు. ‘నన్ను సపోర్ట్‌‌ చేసిన వాళ్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మొదటి నుంచి మీరు నాతోనే ఉన్నారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. మీ ఆశలే నా ఆశలు, మీ కలలే నా కలలు. మీ భవిష్యత్ కోసమే ప్రతి రోజూ పోరాడుతున్నాను’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున బరిలో ఉన్న జో బిడెన్ కూడా విజయంపై ధీమాగా ఉన్నారు. ‘ఇది ఎన్నికల రోజు అమెరికా.. వెళ్లి ఓటేయండి’ అని ట్వీట్‌‌ చేశారు.