ట్విట్టర్ అకౌంట్లకు ఇప్పుడు మరింత ప్రాధాన్యత.. మస్క్ కొత్త ట్వీట్

ట్విట్టర్ అకౌంట్లకు ఇప్పుడు మరింత ప్రాధాన్యత.. మస్క్ కొత్త ట్వీట్

మైక్రోబ్లాగింగ్ సైట్‌ ట్విట్టర్ లో రోజురోజుకూ భారీ మార్పులొస్తున్నాయి. కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ ఇటీవలే తీసుకువచ్చిన బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ తో విపరీతమైన చేంజెస్ చోటుచేసుకున్నాయి. అందుకు నెలకు 8 డాలర్లు చెల్లించి సబ్‌స్ర్కైబ్‌ చేసుకోవాలని రూల్‌ పెట్టారు. ఈ సర్వీసు పొందని వారికి ఏప్రిల్‌ 20న బ్లూ టిక్‌లు తీసేశారు. మళ్లీ ఇటీవలే 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న వారు ఫీజు చెల్లించకపోయినా బ్లూ టిక్‌ ఇవ్వాలని మస్క్‌ నిర్ణయించారు. దీంతో బ్లూ టిక్‌ కోల్పోయిన పలువురు ప్రముఖులకు మళ్లీ బ్లూ టిక్‌ వచ్చింది. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు కూడా. తాజాగా మస్క్ మరో ట్వీట్ చేశారు. వెరిఫైడ్ అకౌంట్లు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయంటూ ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

మోసపూరిత అకౌంట్లను గుర్తించేందుకు తీసుకున్న మస్క్ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో చాలా మంది తమ బ్లూ టిక్ ను కోల్పోవాల్సి వచ్చింది. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత మస్క్ చేసిన ఈ ట్వీట్.. అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మళ్లీ మస్కే ఇంకేం నిర్ణయం తీసుకుంటారోనని యూజర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

https://twitter.com/elonmusk/status/1650731557164818437