దేశవ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో పొలంలో వేసిన రూ.2.5 లక్షల విలువైన టమాటాను గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. కర్ణాటకకు చెందిన ఓ రైతు హాసన్ జిల్లాలోని తన పొలంలో రూ. 2.5 లక్షల విలువైన టమోటాలు దొంగిలించబడ్డాయని ఆరోపించారు.. దేశంలో టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
బెంగళూరులో టమాటా కిలో రూ. 120కి చేరడంతో పంటను కోసి మార్కెట్‌కు తరలించాలని యోచిస్తున్నామని రెండు ఎకరాల భూమిలో టమోటా సాగు చేసిన మహిళా రైతు ధరణి తెలిపారు. “మేము బీన్ పంటలో వేసిన టమాటా పంట వల్ల భారీ నష్టం వచ్చింది. టమాటాలు పండించడానికి లోన్ కూడా తీసుకున్నాం. మాకు మంచి పంట వచ్చింది. ఈ సమయంలోనే ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే 50-60 బస్తాల టమాటాలను తీసుకెళ్లడమే కాకుండా మిగిలిన పంటను కూడా దొంగలు ధ్వంసం చేశారు’’ అని ధరణి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు హళేబీడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు
ఢిల్లీలోని సఫాల్ స్టోర్‌లో టమాటా ధరలు జూలై 5న కిలోకు రూ.129కి చేరుకున్నాయని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అదేవిధంగా, ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లోనూ టమాటా ధరలు కిలోకు రూ. 150 కి చేరుకున్నాయి . ‘‘కూరగాయల ధరలు బాగా పెరిగాయి. టమాటా కిలో రూ.150కి విక్రయిస్తున్నారు. ధరలు పెరగడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కూరగాయల ధరలను క్రమబద్ధీకరించాలని కోరుతున్నాను" అని మొరాదాబాద్‌లోని ఒక టమోటా వినియోగదారుడు డిమాండ్ చేశారు.
