
= పార్టిసిపెంట్లకు కట్టుదిట్టమైన భద్రత
= ఇవాళ కూడా నగరానికి పలువురు పార్టిసిపేంట్స్
హైదరాబాద్: భారత్– పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలు ఉంటాయా..? వాయిదా పడతాయా..? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఇవాళ మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్కోవా, చెక్ రిపబ్లిక్, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలతో స్వాగతం పలికారు.
వీళ్లంతా బస చేసే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వాహక సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోటీలపై తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఆయా దేశాల నుంచి వచ్చిన వారందరి భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
ఇలాంటి పరిస్థితుల్లో మిస్ వరల్డ్ పోటీలకు మూడు వారాలపాటు పూర్తిస్థాయి భద్రత పెద్ద సవాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం నడుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది.