స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్‌‌ సెమీస్‌‌లో అమిత్, సచిన్

స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్‌‌ సెమీస్‌‌లో అమిత్, సచిన్

సోఫియా (బల్గేరియా):  స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్‌‌లో ఇండియా స్టార్ బాక్సర్ అమిత్ పంగల్, సచిన్ సెమీస్ చేరుకున్నారు. శుక్రవారం జరిగిన 51 కేజీ క్వార్టర్‌‌‌‌ ఫైనల్లో అమిత్ 5–0తో బటుల్గా (మంగోలియా)ను చిత్తు చేశాడు. 57 కేజీ క్వార్టర్స్‌‌లో సచిన్‌‌ 5–0తో  కపనాడ్జె (జార్జియా)ను ఓడించాడు. 54 కేజీ బౌట్‌‌లో లలిత్‌‌ 0–5తె కుజనాజర్ (ఉజ్బెకిస్తాన్‌‌) చేతిలో ఓడిపోయాడు.