ఇండియా కూటమిని కౌరవులతో పోల్చిన అమిత్ షా

ఇండియా కూటమిని  కౌరవులతో పోల్చిన అమిత్ షా

ఇండియా కూటమిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు.  దేశంలో రాజకీయం పాండవులు, కౌరవులు అని రెండు పక్షాలుగా విడిపోయిందని  అన్నారు. ఎన్డీఏను పాండవుల కూటమితో, ఇండియా కూటమిని  కౌరవులతో పోల్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పాండువులు.. కౌరవ కూటమిని ఓడిస్తారని చెప్పారు. ఇండియా కూటమిలో ఏడు కుటుంబ పార్టీలు ఉన్నాయని విమర్శించారు. 

ALSO READ : హైదరాబాద్ ను చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ అభివృద్ధి చేశారు: రేవంత్ రెడ్డి

ఢిల్లీలో జరుగుతోన్న బీజేపీ జాతీయ మండలి కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొన్న అమిత్ షా.. ఇండియా కూటమిపై ద్వజమెత్తారు. దేశంలో కుటుంబ పార్టీలకు ప్రధాని మోదీ పుల్ స్టాప్ పెట్టారని పేర్కొన్నారు.  మోదీ పదేళ్ల పాలనలో దేశంలోని ప్రతి ఒక్క రంగం అభివృద్ది సాధించిందని అన్నారు. రాబోయో ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.